సున్నా వడ్డీ పథకం కొత్తది కాదు..పాతదే: Tulasireddy

ABN , First Publish Date - 2022-04-22T16:26:16+05:30 IST

మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కొత్తది కాదని. ఇది పాత పథకమే అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

సున్నా వడ్డీ పథకం కొత్తది కాదు..పాతదే: Tulasireddy

అమరావతి: మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కొత్తది కాదని... ఇది పాత పథకమే అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్క సంఘానికి రూ.5  లక్షలు వరకు ఈ పథకం వర్తించేదని, దాదాపు అన్ని సంఘాలు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేవని తెలిపారు. జగన్ పాలనలో ఒక్కొక్క సంఘానికి రూ.3 లక్షలు వరకు మాత్రమే పరిమితి విధించారన్నారు. దీని వలన 25 శాతం మాత్రమే సంఘాలు లబ్ధి పొందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ప్రభుత్వ ఖర్చుతో ఈ పథకం గురించి ప్రచార ఆర్భాటాలు చేసుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం మరీ ఎక్కువైందని,  పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లుందని యెద్దేవా చేశారు. రూ.3 లక్షల వరకు ఉన్న రుణ పరిమితిని తొలగించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-22T16:26:16+05:30 IST