ఉద్యోగులు, నిరుద్యోగులను జగన్ నమ్మించి మోసం చేశారు: Tulasi reddy

ABN , First Publish Date - 2022-01-14T18:09:24+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను, నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు.

ఉద్యోగులు, నిరుద్యోగులను జగన్ నమ్మించి మోసం చేశారు: Tulasi reddy

కడప: ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను, నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదాను నీరు గార్చారని,  ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ను 62 సంవత్సరాలకు పెంచారని అన్నారు. నిరుద్యోగులు ఇప్పటికే కోచింగ్ సెంటర్‌లలో కోచింగ్ తీసుకుంటున్నారని... అయితే నిరుద్యోగు యువతను జగన్ నట్టేట ముంచారని విమర్శించారు. ఉద్యోగులు మూకుమ్మడిగా వైసీపీకి ఓట్లేశారని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ నెరవేర్చలేదన్నారు. పీఆర్సీలో ఉద్యోగులను సీఎం జగన్  మోసం చేశారన్నారు. పీఆర్సీ పే రివర్స్ కమిషన్‌‌గా మారిందని ఆయన వ్యాఖ్యలు చేశారు.


9వ పీఆర్సీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 30 శాతం పైగా ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 30 శాతం ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చారన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పట్టుబట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు. గుంటూరులో టీడీపీ నేత తోట చంద్రయ్యను వైసీపీ నేతలు దారుణంగా చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం, రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు. హత్యా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని శైలజానాథ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-14T18:09:24+05:30 IST