Tulasireddy: వివేకా హత్య కేసు విచారణ ఆలస్యంపై తులసిరెడ్డి ఆగ్రహం

ABN , First Publish Date - 2022-09-14T16:19:56+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి మూడున్నరేళ్లు గడిచినప్పటికీ విచారణ పూర్తి కాలేదు కదా... అతీగతీ లేదని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tulasireddy: వివేకా హత్య కేసు విచారణ ఆలస్యంపై తులసిరెడ్డి ఆగ్రహం

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Vivkananda reddy) హత్య జరిగి మూడున్నరేళ్లు గడిచినప్పటికీ విచారణ పూర్తి కాలేదు కదా... అతీగతీ లేదని కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసి రెడ్డి (Tulasireddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసమర్థతా? లేక హంతకులను రక్షించే ప్రయత్నమా? అని ప్రశ్నించారు. పై రెండు కారణాలలో ఏ ఒక్కటైనా ముఖ్యమంత్రి జగన్‌ (CM jagan mohan reddy)కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. సీబీఐ (CBI)కు సహకరించి త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులను చట్టపరంగా శిక్షించాలన్నారు. లేనిపక్షంలో సీఎం జగన్ (AP CM) పదవినుంచి దిగిపోవాలని తులసిరెడ్డి (Congress leader) డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-14T16:19:56+05:30 IST