సున్నా వడ్డీ పథకం పాతదే... కొత్తది కాదు: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-04-23T16:22:34+05:30 IST

మహిళా సంఘాలకు సున్నా వడ్డీ పథకం పాతదే కొత్తది కాదని...ఇది కాంగ్రెస్‌ పథకమని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు.

సున్నా వడ్డీ పథకం పాతదే... కొత్తది కాదు: తులసిరెడ్డి

విజయవాడ: మహిళా సంఘాలకు సున్నా వడ్డీ పథకం పాతదే కొత్తది కాదని...ఇది కాంగ్రెస్‌ పథకమని  ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 2004-05 ఆర్ధిక సంవత్సరంలో రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పావలా వడ్డీ పథకం ప్రారంభమైందని... దీనిని 2010-11 ఆర్ధిక సంవత్సరంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సున్నా వడ్డీ (వడ్డీలేని రుణాలు) పథకంగా మార్చడం జరిగిందని చెప్పుకొచ్చారు. 2016-17 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో జగన్‌ ప్రభుత్వం పునరుద్దరించిందని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో ఒక్కొక్క సంఘానికి రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీ పథకం వర్తించేదని.. జగన్‌ పాలనలో 3 లక్షల వరకే సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందన్నారు. దీనికి ఇంత ప్రచార ఆర్భాటం అవసరమా అని ప్రశ్నించారు. పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లుంది జగన్‌ ప్రభుత్వ తీరు అంటూ తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-04-23T16:22:34+05:30 IST