Tulasireddy: ‘భారత్‌ జోడో యాత్ర’తో బీజేపీ దుష్ట పాలనకు విముక్తి

ABN , First Publish Date - 2022-09-07T18:13:50+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర... మరో దండి యాత్ర, మరో క్విట్ ఇండియా ఉద్యమం కాబోతోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసి రెడ్డి అన్నారు.

Tulasireddy: ‘భారత్‌ జోడో యాత్ర’తో బీజేపీ దుష్ట పాలనకు విముక్తి

అమరావతి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul gandhi) చేపట్టబోయే ‘‘భారత్ జోడో యాత్ర’’ (Bharat Jodo Yatra)...  మరో దండి యాత్ర, మరో క్విట్ ఇండియా ఉద్యమం కాబోతోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసి రెడ్డి (Tulasi reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం నాటి బ్రిటిష్ దుష్ట పాలనకు చరమగీతం పాడాయని తెలిపారు. నేటి భారత్ జోడో యాత్రతో బీజేపీ (BJP) దుష్ట పాలన నుండి దేశానికి, వైసీపీ (YCP) దుష్ట పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.


భారత్ జోడో యాత్ర నేటి నుంచి 148 రోజుల పాటు... 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 68 లోక్ సభ స్థానాలు, 203 అసెంబ్లీ స్థానాల మీదుగా 3571 కిలోమీటర్లు దూరం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశలో 4 రోజుల పాటు రాయదుర్గం, ఆలూరు, ఆదోని, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 100 కిలోమీటర్లు సాగుతుందని చెప్పారు. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని తులసిరెడ్డి (Tulasi reddy) విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-09-07T18:13:50+05:30 IST