జగనన్న కాసుల కక్కుర్తి పథకంగా ఓటీఎస్: Tulasi reddy

ABN , First Publish Date - 2022-02-02T19:21:58+05:30 IST

ఓటీఎస్ పథకాన్ని స్వచ్ఛందం అంటూనే నిర్భందం, బలవంతం చేయడం, లక్ష్యాలు నిర్ధ్యేశించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

జగనన్న కాసుల కక్కుర్తి పథకంగా ఓటీఎస్: Tulasi reddy

అమరావతి: ఓటీఎస్ పథకాన్ని స్వచ్ఛందం అంటూనే నిర్భందం, బలవంతం చేయడం, లక్ష్యాలు నిర్ధ్యేశించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కింది స్థాయి సిబ్బంది మనో వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఒత్తిడిని తట్టుకోలేక జనవరి 31న కడప జిల్లా రాజంపేట మండలం మదనగోపాలపురం వీఆర్వో ఆత్మహత్య ప్రయత్నం చేశారన్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయని చెప్పారు. ఓటీఎస్ పథకం జగనన్న కాసుల కక్కుర్తి పథకంగా తయారైందని విమర్శించారు. పేదల నుండి రూ.5 వేల కోట్లు దోచుకునే దోపిడీ పథకం ఇది అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌కు పేదల పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఓటీఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-02T19:21:58+05:30 IST