చలో రాజ్‌భవన్‌కు తరలిన కాంగ్రెస్‌ నేతలు

ABN , First Publish Date - 2021-07-23T06:24:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెగాసిస్‌ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ విపక్ష నేతలు, జర్నలిస్టుల సంభాషణలను దొంగచాటుగా వినడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వ ర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన చలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి జిల్లా నేతలు తరలివెళ్లారు.

చలో రాజ్‌భవన్‌కు తరలిన కాంగ్రెస్‌ నేతలు
రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమంలో మాట్లాడుతున్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌

జిల్లాలో పలువురు నేతల ముందస్తు అరెస్ట్‌
నిజామాబాద్‌ అర్బన్‌, జూలైౖ 22: కేంద్ర ప్రభుత్వం పెగాసిస్‌ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ విపక్ష నేతలు, జర్నలిస్టుల సంభాషణలను దొంగచాటుగా వినడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వ ర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన చలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి జిల్లా నేతలు తరలివెళ్లారు.   పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, కేశవేణు, అ ర్బన్‌ ఇంచార్జ్‌ తాహెర్‌బిన్‌హుందాన్‌ పాల్గొన్నారు. ఇది లా ఉండగా..  కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు చలో రా జ్‌భవన్‌ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్‌ నాయకుల ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మె ల్సీ భూపతిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గం గాఽధర్‌ నగర కార్పొరేటర్‌ రోహిత్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, నాయకులు నగేష్‌రెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డిలను పోలీసు లు హైదరాబాద్‌ వెళ్లకుండా హౌజ్‌ అరెస్టు చేశారు. అ దే విధంగా బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ పట్టణాలతో పా టు అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ఉదయమే అరెస్ట్‌ చేసి.. మధ్యాహ్నం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Updated Date - 2021-07-23T06:24:41+05:30 IST