ఇంటి అద్దె చెల్లించని సోనియా గాంధీ

ABN , First Publish Date - 2022-02-11T08:43:56+05:30 IST

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు తాము నివాసం ఉండే భవనాలకు అద్దె చెల్లించలేదని ..

ఇంటి అద్దె చెల్లించని సోనియా గాంధీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు తాము నివాసం ఉండే భవనాలకు అద్దె చెల్లించలేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్బర్‌ రోడ్డులోని కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయానికి రూ.12,69,902, 10 జన్‌పథ్‌ రోడ్డులోని సోనియా నివాసానికి రూ.4,610 అద్దె బకాయిలు ఉన్నట్లు వివరించింది. బీజేపీ నేత సుజిత్‌ పటేల్‌ ఆర్టీఐ చట్టం కింద చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. 

Updated Date - 2022-02-11T08:43:56+05:30 IST