‘నా కుటుంబం గురించి మాట్లాడితే ఊరుకోను’

ABN , First Publish Date - 2021-11-18T17:17:50+05:30 IST

‘నాతోపాటు నా కుటుంబ సభ్యులపట్ల తప్పుగా మాట్లాడితే చేతులు కట్టుకుని మౌనంగా ఉండేది లేదు’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే హెచ్చరించారు. బుధవారం బెంగళూరులో కేపీసీసీ కార్యాలయంలో ఆ

‘నా కుటుంబం గురించి మాట్లాడితే ఊరుకోను’

               - నా ఆస్తులపై విచారణ జరిపించుకోండి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే 


బెంగళూరు: ‘నాతోపాటు నా కుటుంబ సభ్యులపట్ల తప్పుగా మాట్లాడితే చేతులు కట్టుకుని మౌనంగా ఉండేది లేదు’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే హెచ్చరించారు. బుధవారం బెంగళూరులో కేపీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా దాడి చేసే సంస్కృతిని తమ కుటుంబం నేర్పలేదన్నారు.  బీజేపీకి చెందిన కొందరు తన పట్ల హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిట్‌ కాయిన్‌ అక్రమాలపై ప్రశ్నించినందుకు కొన్ని బిరుదులతో వ్యంగ్యం చేస్తున్నారన్నారు. సదాశివనగర్‌లో భవనం ఉందని, విలాసవంతమైన కార్లు ఉన్నాయని, రూ. 50వేల కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు చేశారన్నారు. అలాంటివారు తన ఆస్తులపై విచారణ జరిపించాలన్నారు. తనపై ఆరోపణలు చేసినవారికి లీగల్‌ నోటీసులు ఇస్తానని, పాత కేసెట్‌ ఎంతకాలం ప్లే చేస్తారంటూ మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్యను ఉద్దేశించి మాట్లాడుతూ పదే పదే దూషించడం సరికాదని, మీరు మంత్రి కాలేరన్నారు. వరదలు వచ్చినప్పుడు అడుగునీరు లేకున్నా తెప్పలో వెళ్లినవారి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. మైసూరు ఎంపీ ప్రతాపసింహ పేపర్‌ సింహ అన్నారు. అతను హోదాకు తగ్గట్టు వ్యవహరించలేదన్నారు. ఎవరూ దరఖాస్తు చేసుకుని పుట్టరని, మల్లికార్జున ఖర్గే కుమారుడిగా గర్వపడుతున్నానన్నారు. తనను పిల్ల ఖర్గే అన్న ప్రతా్‌పసింహ విజయేంద్రను పిల్లయడియూరప్ప, జైషాను చోటా షా అనే వ్యాఖ్యలు చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. తన కుటుంబం పట్ల హేళనగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతానన్నారు. 

Updated Date - 2021-11-18T17:17:50+05:30 IST