హైదరాబాద్: కోవిడ్ తీవ్రత అధికంగా వున్న సమయంలో రెమ్ డెసివిర్(Remdecivir) లాంటి ఇంజెక్షన్ ను ఒక్కోటి లక్ష వరకు అమ్ముకున్నారని, ఫార్మా మాఫియా విచ్చలవిడి తనానికి ఇదోక ఉదాహరణ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(jagga reddy) ఆరోపించారు.అదే సమయంలో హెటిరో పార్థసారథి ఆఫీస్లో ఐటీ శాఖ దాడులు చేసి రూ.500 కోట్లు పట్టుకుందని గుర్తుచేశారు. ఈ కేసు ఏమైందో ఇంతవరకు చెప్పడం లేదు.రెమిడిసివిర్ దందాలో రూ.10వేల కోట్ల స్కామ్ జరిగిందని జగ్గారెడ్డి ఆరోపించారు.ఒక్కో ఇంజెక్షన్ రూ.లక్ష వరకు హెటిరో విక్రయించింది.
ఇంత పెద్ద స్కామ్ చేసిన పార్థసారథి రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రెమిడిసివిర్కు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? 4 నెలల తర్వాత ప్రాణానికి నష్టమని ఎందుకు చెప్పారని జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఇస్తారా? పార్థసారథికి రాజ్యసభ టికెట్ రావడంలో బీజేపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.పార్థసారథిపై ఎన్నికల కమిషన్, సీబీఐకి లేఖ రాస్తానని జగ్గారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి