బీజేపీకి వర్తించని కోవిడ్ రూల్స్ కాంగ్రెస్‌కే వర్తిస్తాయా..?: Jagga reddy

ABN , First Publish Date - 2022-01-07T18:43:18+05:30 IST

బీజేపీకి వర్తించని కోవిడ్ రూల్స్ కాంగ్రెస్‌కే వర్తిస్తాయా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.

బీజేపీకి వర్తించని కోవిడ్ రూల్స్ కాంగ్రెస్‌కే వర్తిస్తాయా..?: Jagga reddy

హైదరాబాద్: బీజేపీకి వర్తించని కోవిడ్ రూల్స్ కాంగ్రెస్‌కే వర్తిస్తాయా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇస్తున్న సర్కార్... కాంగ్రెస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇవ్వదా అని ప్రశ్నించారు.  ‘‘నేనే రాష్ట్ర డీజీపీని అడుగుతున్నా, వారికీ లేని కోవిడ్ మాకే ఉందా?...కాంగ్రెస్‌కు రాష్ట్రంలో, కేంద్రంలో పవర్ లేదని పర్మిషన్ ఇవ్వరా’’ అని నిలదీశారు. కోవిడ్ నిబంధనలకు లోబడే శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు.  కాంగ్రెస్‌ 120 నుండి 150 మందితో శిక్షణ తరగతులకు అనుమతి కోరితే ఇవ్వలేదని... ఆర్ఎస్ఎస్  మీటింగ్‌కు 300 మంది హజరయ్యారని తెలిపారు. బీజేపీ నేతలు ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని.. దీనిపై డీజీపీ స్పందించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-07T18:43:18+05:30 IST