Assembly lobbyలో జగ్గారెడ్డి షర్ట్‌‌పై ఆసక్తికర చర్చ... ట్విస్ట్ ఏంటంటే

ABN , First Publish Date - 2022-09-13T18:36:31+05:30 IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధరించిన చొక్కాపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది.

Assembly lobbyలో జగ్గారెడ్డి షర్ట్‌‌పై ఆసక్తికర చర్చ... ట్విస్ట్ ఏంటంటే

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga reddy) ధరించిన చొక్కాపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు కెన్జో (KENZO) షర్ట్ ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఎప్పుడు తెలుపు షర్ట్ లేదంటే టీ షర్ట్‌తో వచ్చే జగ్గారెడ్డి (Congress MLA) క్యాజువల్‌లో రావడంతో చర్చ జరిగింది. షర్ట్ ధర ఎంతంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... రూ.35 వేలంటూ జగ్గారెడ్డి (congress leader) సమాధానం చెప్పారు. దీంతో అంత ధర ఉంటుందా అంటూ ఆశ్చర్యపోవడం జర్నలిస్టుల (Journalists) వంతైంది. అయితే డౌట్ ఉంటే గూగుల్‌లో ప్రైస్ చెక్ చేసుకోండి అని కాంగ్రెస్ నేత ఉచిత సలహా ఇచ్చారు.


వెంటనే మీడియా ప్రతినిధులు (Media representatives) డ్రెస్ ధర కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. ‘‘నేను విలువైన షర్ట్ వేసుకోకూడదా... జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వేసుకోవాలా’’ అంటూ జగ్గారెడ్డి సరదాగా కామెంట్ చేశారు. చొక్కాలు లేకపోవడంతో తన కొడుకు షర్ట్ వేసుకుని వచ్చానని జగ్గారెడ్డి తీరగ్గా అసలు విషయం బయటపెట్టారు. రాహుల్ గాంధీ (Rahul gandhi) షర్ట్ మీద కూడా బీజేపీ నేతలు (BJP Leaders) చర్చ చేస్తున్నారని.. ఆయనకు రూ.40 వేల టీ షర్ట్ వేసుకునే స్థోమత లేదా అని జగ్గారెడ్డి చురకలంటించారు.

Updated Date - 2022-09-13T18:36:31+05:30 IST