MLC Jeevan reddy: సెప్టెంబర్ 17పై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు

ABN , First Publish Date - 2022-09-03T20:16:00+05:30 IST

సెప్టెంబర్ 17పై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (Jeevan reddy) విమర్శించారు

MLC Jeevan reddy: సెప్టెంబర్ 17పై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు

హైదరాబాద్: సెప్టెంబర్ 17పై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (Jeevan reddy) విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...  హైదరాబాద్ విలీనంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌(Congress)కే ఉందని అన్నారు. సీబీఐని రాష్ట్రాల్లోకి అనుమతించొద్దని కేసీఆర్ అనడం ఆశ్చర్యం కలిగిస్తోందిన్నారు. సీబీఐ విచారణ వద్దంటే.. రాష్ట్రంలో సీఐడీ విచారణ కూడా జరగొద్దని అన్నారు. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) ప్రజా సమస్యలు పక్కన పెట్టి రేషన్ కార్డులపై బొమ్మల కోసం గొడవ పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ (CM KCR) జాతీయ పార్టీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. కేసీఆర్ (Telangana CM) ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని భావించడం లేదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-03T20:16:00+05:30 IST