హైదరాబాద్‌లో పడినట్లు వర్షం పడితే... యాదాద్రి గుడి కూలిపోయేది: Komatireddy

ABN , First Publish Date - 2022-05-05T18:24:31+05:30 IST

నిన్నటి వర్షానికి యాదగిరి గుట్ట వద్ద రోడ్లు కొట్టుకుపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.

హైదరాబాద్‌లో పడినట్లు వర్షం పడితే... యాదాద్రి గుడి కూలిపోయేది: Komatireddy

యాదాద్రి: నిన్నటి వర్షానికి యాదగిరి గుట్ట వద్ద రోడ్లు కొట్టుకుపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. గతేడాది హైదరాబాద్‌లో పడినట్లు వర్షం పడితే యాదగిరిగుట్ట గుడి కూడా కూలిపోయేదని అన్నారు. రెండు గంటల వర్షానికే క్యూ లైన్లు, రోడ్లు, గుడికి ఎదురుగా ప్రాంతం జలమయమైందని తెలిపారు. ఎనిమిదేళ్లుగా ఇరవై సార్లు వచ్చిన సీఎం కేసీఆర్ ఏం పరిశీలించారని ప్రశ్నించారు. ఎవరా కాంట్రాక్టర్, సినిమా ఆర్ట్ డైరెక్టర్‌కు పని అప్పగించి మంచి యాదగిరిగుట్టను రెండు వేల కోట్లు రూపాయలతో నాశనం చేశారని విరుచుకుపడ్డారు. యాదాద్రి పనులపైన సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు... దోచుకుంది ఎవరు, నాణ్యత మీద విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, విజిలెన్స్ వాళ్లకు లెటర్ రాయనున్నట్లు తెలిపారు. ఈఓ గీతారెడ్డి ఇష్టానుసారంగా నామినేషన్ మీద పనులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పరువు తీశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

Read more