Uttamkumar reddy: మునుగోడు అభ్యర్థిపై ఏఐసీసీదే తుది నిర్ణయం

ABN , First Publish Date - 2022-08-30T19:52:08+05:30 IST

మునుగోడు అభ్యర్థి విషయంలో ప్రతిపాదనలు ఏఐసీసీకి పంపామని... దానిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

Uttamkumar reddy: మునుగోడు అభ్యర్థిపై ఏఐసీసీదే తుది నిర్ణయం

హైదరాబాద్: మునుగోడు (Munugodu bypoll) అభ్యర్థి విషయంలో ప్రతిపాదనలు ఏఐసీసీ (AICC)కి పంపామని... దానిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttamkumar reddy) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మునుగోడు గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తామన్నారు. గులాబ్ నబీ ఆజాద్‌ (Gulab Nabi Azad)ను కాంగ్రెస్ (Congress) ఏడు సార్లు ఎంపీని చేసిందని... అలాగే సీఎంను కూడా చేసిందని తెలిపారు. పార్టీలో ఎక్కువ లబ్దిపొందింది ఆజాద్ అని అన్నారు. ఎంపీ పదవి రెన్యువల్ చేయలేదని గాంధీ కుటుంబాన్ని దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ తెలంగాణ సమాజంలో చిచ్చు పెడుతోందని ఎంపీ మండిపడ్డారు.


రాజాసింగ్‌ (Raja singh)ను బీజేపీ (BJP) ఆయుధంగా వాడుకుంటోందన్నారు. అసెంబ్లీ నుంచి రాజసింగ్‌ (BJP MLA)ను ఎక్స్పెల్ చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి రాజాసింగ్‌ (BJP Leader)పై విచారణ చేయాలన్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం తెలంగాణ (Telangana)కు ఆదేశాలు ఇవ్వడం టీఎర్ఎస్ (TRS), బీజేపీ ఆడుతున్న డ్రామా అని వ్యాఖ్యానించారు. మునుగోడు ముందు రెండు ప్రాంతాల మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి పై సీబీఐ (CBI), ఈడీ (ED) విచారణకు ఆదేశించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-30T19:52:08+05:30 IST