ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ రియాక్షన్

ABN , First Publish Date - 2022-04-26T22:18:31+05:30 IST

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేసిన తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. 2024 సాధారణ ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పటిష్టాని

ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ రియాక్షన్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేసిన తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. 2024 సాధారణ ఎన్నికల ప్రణాళికలో భాగంగా  కాంగ్రెస్ పటిష్టతకు ఏర్పాటు చేసిన ఈఏజీ(ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్)లో సభ్యుడిగా కాంగ్రెస్‌లో చేరడంలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల బాధ్యత తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. పార్టీలో చేరాలని కాంగ్రెస్ ఉదారంగా ఆహ్వానించింది. కానీ తిరస్కరించానని చెప్పారు. కాంగ్రెస్ పునరుజ్జీవంలో కాంగ్రెస్‌కు తనకంటే నాయకత్వం ముఖ్యమని పీకే అభిప్రాయపడ్డారు. రూపాంతర సంస్కరణల ద్వారా క్షేత్రస్థాయిలో పేరుకుపోయిన సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ నాయకత్వం, సమష్టి కృషి ఎంతో  అవసరమన్నారు. కాగా పార్టీలో సీనియర్ పదవితోపాటు కాంగ్రెస్ పునరుజ్జీవ ప్రణాళికలో స్వేచ్ఛ ఇవ్వాలని ప్రశాంత్ కిశోర్ కోరారని.. ఇందుకు పార్టీ అధిష్ఠానం తిరస్కరించిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-04-26T22:18:31+05:30 IST