Congressలో జమీర్‌ వ్యాఖ్యల కలకలం

ABN , First Publish Date - 2022-02-15T18:50:51+05:30 IST

హిజాబ్‌ వివాదంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతుండగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ వ్యాఖ్యలతో ఆ పార్టీలో కలకలం నెలకొంది. అది అగ్రనేతల మధ్య అలజడికి దారితీసింది. హిజాబ్‌ ధరించకుంటే అత్యాచారాలు జరుగుతాయ

Congressలో జమీర్‌ వ్యాఖ్యల కలకలం

- క్షమాపణలు చెప్పాలన్న డీకే శివకుమార్‌

- చెప్పే ప్రసక్తే లేదన్న జమీర్‌ 


బెంగళూరు: హిజాబ్‌ వివాదంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతుండగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ వ్యాఖ్యలతో ఆ పార్టీలో కలకలం నెలకొంది. అది అగ్రనేతల మధ్య అలజడికి దారితీసింది. హిజాబ్‌ ధరించకుంటే అత్యాచారాలు జరుగుతాయని హుబ్బళ్లిలో ఆదివారం జమీర్‌ వ్యాఖ్యానించారు. మరోసారి అదే అభిప్రాయాన్ని బెంగళూరులోనూ సోమవారం కొనసాగించారు. జమీర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తీవ్రంగా స్పందించారు. హిజాబ్‌కు అత్యాచారానికి లింకు ఏమిటని, ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలు ఏమర్థం చేసుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. జమీర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని డీకే శివకుమార్‌ సోమవారం ప్రకటించారు. కాగా జమీర్‌ అహ్మద్‌ తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు. హెల్మెట్‌ ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో... హిజాబ్‌ కూడా అంతేననే అభిప్రాయంతో కాంగ్రెస్‌లో వీరిమధ్య మరోసారి వివాదం రాజుకుంది. పరిషత్‌ ప్రతిపక్షనేత బీకే హరిప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ జమీర్‌ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేనివని, ఆయన వ్యక్తిగతమైనవని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-15T18:50:51+05:30 IST