అగ్నిపథ్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-06-28T05:13:16+05:30 IST

దేశభద్రతను ప్రమాదంలో పడవేసే అగ్నిపథ్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

అగ్నిపథ్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి
అగ్నిపథ్‌కు వ్యతిరేఖంగా కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

గుంటూరు(తూర్పు), జూన్‌27: దేశభద్రతను ప్రమాదంలో పడవేసే అగ్నిపథ్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేఖంగా సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలీ మాట్లాడుతూ దేశానికి మోదీ పాలన అరిష్టమని మండిపడ్డారు. అగ్నిపఽథ్‌తో దేశ భద్రతో పాటు, సైన్యం కూడా నిర్వీర్యం అవుతుందన్నారు. సైన్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసేందుకే అగ్నిపథను తీసుకువచ్చారని విమర్శించారు. అగ్నిపఽథ్‌ను రద్దు చేయడంతో పాటు, అర్మీ అభ్యర్ధులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ మోదీ విధానాలకు వ్యతిరేఖంగా కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే పోరాడుతుందని పేర్కోన్నారు. టీడీపీ, జనసేన, వైసీపీలు కూడా బీజేపీ అన్యాయాలను ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిరసనల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జగన్‌మోహనరెడ్డి, ఉస్మాన్‌, అంబటి రత్తయ్య, చిన్నపోలిరెడ్డి, కరీమా, రెహమన్‌, కొమ్మినేని సురేష్‌,చంద్రపాల్‌, వెంకటరెడ్డి, నాగుల్‌మీరా, మౌలాలి, పరిశుద్దరావు, బాబురావు, బ్రహ్మాయ్య, జానీ, గడ్డం పాల్‌, ఇస్మాయేల్‌, నజ్మా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T05:13:16+05:30 IST