Agnipath విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళన

ABN , First Publish Date - 2022-06-27T18:08:23+05:30 IST

సైన్యం నియామకంలో అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా..

Agnipath విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళన

విజయవాడ : సైన్యం నియామకంలో అగ్నిపథ్(Agnipath) విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్(Congress) ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత నరహరిశెట్టి నరసింహరావు మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకాన్ని దేశం మొత్తం వ్యతిరేకిస్తోందన్నారు. ప్రధాని మోదీ తన మాయ మాటలతో యువతను మోసం‌ చేశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు అభద్రతా భావంతో ఉన్నారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కూడా ఆపాలన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టాలని నరసింహారావు డిమాండ్ చేశారు.


Updated Date - 2022-06-27T18:08:23+05:30 IST