గజ్వేల్‌ దండోర సభకు తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

ABN , First Publish Date - 2021-09-18T05:25:59+05:30 IST

గజ్వేల్‌లో నిర్వహిస్తున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరసభకు కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

గజ్వేల్‌ దండోర సభకు తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు
తూప్రాన్‌ నుంచి గజ్వేల్‌ సభకు తరలివెళ్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు

తూప్రాన్‌, సెప్టెంబరు 17: గజ్వేల్‌లో నిర్వహిస్తున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరసభకు కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల నుంచి ఊరూర జనసమీకరణ చేపట్టారు. తూప్రాన్‌లో అయ్యప్ప ఆలయం నుంచి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను గజ్వేల్‌ సభకు పంపించారు. ఇందులో కాంగ్రె్‌సపార్టీ మండలాధ్యక్షుడు ఉమ్మన్నగారి భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు పల్లెర్ల రవీందర్‌గుప్తా, కొక్కొండ శశిభూషన్‌రెడ్డి, రామునిగారి నాగరాజుగౌడ్‌, నాగులపల్లి శ్రీనివా్‌సరెడ్డి, నాగులపల్లి సత్యనారాయణ, కావేరిగారి వెంకట్‌గౌడ్‌, శ్రీరాములు, నర్సింగ్‌రావు, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

తూప్రాన్‌రూరల్‌/ చిన్నశంకరంపేట/పెద్దశంకరంపేట/శివ్వంపేట/నర్సాపూర్‌/కొల్చారం/చిల్‌పచెడ్‌/చేగుంట/రేగోడు/అల్లాదుర్గం/హవేళీఘణపూర్‌/నిజాంపేట/రామాయంపేట/మెదక్‌/పాపన్నపేట, సెప్టెంబరు 17 : తూప్రాన్‌ మండలం యావాపూర్‌ నుంచి మాజీ ఎంపీటీసీ స్వామి ఆద్వర్యంలో, నర్సంపల్లి నుంచి సీనియర్‌ నేత జింక మల్లేశ్‌ ఆద్వర్యంలో మోటర్‌ సైకిళ్లపై గజ్వేల్‌ సభకు ర్యాలీగా తరలివెళ్లారు. చిన్నశంకరంపేట, చేగుంట మండలం నుంచి డీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ జడ్పీటీసీ పోతరాజు రమణ ఆధ్వర్యంలో, పెద్దశంకరంపేట మండల కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు జనార్దన్‌ ఆధ్వర్యంలో, శివ్వంపేట మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో, నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, రాష్ట్ర నాయకులు ఆవులరాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్‌, రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో, కొల్చారం మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో, చిల్‌పచెడ్‌, అల్లాదుర్గం మండలం నుంచి,  రేగోడు మండలం నుంచి మండలాధ్యక్షుడు మున్నూరు కిషన్‌, జడ్పీటీసీ యాదగిరి ఆధ్వర్యంలో, హవేళీఘణపూర్‌ నుంచి కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో, నిజాంపేట మండలం నుంచి మండలాధ్యక్షుడు బక్కన్నగారి లింగంగౌడ్‌ ఆధ్వర్యంలో, రామాయంపేట నుంచి పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు ఆధ్వర్యంలో, మెదక్‌ నుంచి మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలో, పాపన్నపేట మండలం నుంచి మండలాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు గజ్వేల్‌లో నిర్వహించే సభకు తరలివెళ్లారు. 

సంగారెడ్డి నుంచి

రామచంద్రాపురం/హత్నూర/జిన్నారం/వట్‌పల్లి/గుమ్మడిదల/కల్హేర్‌/నారాయణఖేడ్‌/నాగల్‌గిద్ద/జహీరాబాద్‌/రాయికోడ్‌/నర్సాపూర్‌,  సెప్టెంబరు 17 : పటాన్‌చెరు నియోజక వర్గం నుంచి తెల్లాపూర్‌ మున్సిపల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పర్స శ్యాంరావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు వాహనాల్లో ర్యాలీగా తరలివచ్చారు. భారీ ఎత్తున వాహనాలు రహదారిపై మోహరించడంతో 65నంబరు జాతీయ రహదారిపై ఇరువైపుల సుమారు గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. హత్నూర మండలం నుంచి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్‌ ఆధ్వర్యంలో, జిన్నారం మండలం నుంచి ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, బొల్లారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ గంగు రమేష్‌, మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో, వట్‌పల్లి మండలంలోని కాంగ్రెస్‌ శ్రేణులు, గుమ్మడిదల మండలం నుంచి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, మండలాధ్యక్షుడు మద్ది వీరారెడ్డి ఆధ్వర్యంలో, కల్హేర్‌ మండలం నుంచి మండలాధ్యక్షుడు పోచయ్య ఆధ్వర్యంలో, నారాయణఖేడ్‌ నియోజకవర్గం నుంచి జహీరాబాద్‌ మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు సురే్‌షకుమార్‌ షెట్కార్‌, టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో, నాగల్‌గిద్ద మండలం నుంచి పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌, మండలాధ్యక్షుడు మాణిక్‌రావు ఆధ్వర్యంలో, జహీరాబాద్‌ నియోజకవర్గంలోని కోహీర్‌, ఝరసంగం, జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌ మండలాల నుంచి  టీపీసీసీ నాయకుడు నరోత్తం ఆధ్వర్యంలో, రాయికోడ్‌ మండలం నుంచి మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ సిద్దపాటిల్‌, మాజీ జడ్పీటీసీ అంజయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు పలు వాహనాల్లో గజ్వేల్‌లో నిర్వహిస్తున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరసభకు తరలివెళ్లారు.


Updated Date - 2021-09-18T05:25:59+05:30 IST