రేపు కాంగ్రెస్‌ ’సత్యాగ్రహ’ దీక్ష

Published: Sun, 26 Jun 2022 00:16:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), జూన్‌ 25 : కేంద్రం ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 27న జిల్లా వ్యాప్తంగా స త్యగ్రహ దీక్షను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ వరంగల్‌, హనుమకొండ జిల్లాల  అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం వి డుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐసీసీ ఆదేశాలు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచన మేరకు దీక్షను చేపడుతున్నట్లు వెల్లడించారు. హ నుమకొండ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఉదయం 9:30 గంటలకు దీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు ముగుస్తుందన్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షను చేపట్టాలని నాయకులు, కార్యకర్తలు సూచించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.