
New Delhi: కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష (Congress Satyagraha Deeksha) కొనసాగుతోంది. సోమవారం కూడా జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ (Congress leaders) నేతలు నిరసన చేపట్టారు.
కాగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. జంతర్ మంతర్ వద్దకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నేతల బృందం సోమవారం సాయంత్రం రాష్ట్రపతిని కలవనున్నారు.
సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కన్నయ్య కుమార్, మల్లిఖర్జున ఖర్గే, జేడీ శీలం, రణదీప్ సూర్జేవాల, కాంగ్రెస్ ఎంపీలు, ఏఐసీసీ కార్యదర్శులు, రాష్టాల పీసీసీ ప్రెసిడెంట్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి