మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ ప్రశంసలు

ABN , First Publish Date - 2021-03-01T03:08:39+05:30 IST

దేశ ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రశంసించారు. మోదీ చాలా గొప్ప వ్యక్తని, ఏమాత్రం అహంకారం లేని మనిషంటూ ఆజాద్ కొనియాడారు. మోదీని చూసి చాలా నేర్చుకోవచ్చని..

మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ ప్రశంసలు

న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రశంసించారు. మోదీ చాలా గొప్ప వ్యక్తని, ఏమాత్రం అహంకారం లేని మనిషంటూ ఆజాద్ కొనియాడారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీని చూసి చాలా నేర్చుకోవచ్చని అన్నారు. ప్రధాని అయినప్పటికీ ఆయన మూలాలను ఎప్పడూ మోదీ మర్చిపోలేదని, ఇప్పటికీ తనను తాను చాయ్‌వాలాగానే చెప్పుకుంటారని, అది ఎంతో గొప్ప విషయమని ఆజాద్ అన్నారు. ‘ప్రధాని మోదీతో రాజకీయంగా భిన్న విధానాలున్నా ఆయన విధానాలను మాత్రం కచ్చితంగా అభినందిస్తానం’టూ అజాద్ పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆజాద్ తన రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్‌లోనే ఆయన వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమలో ప్రధాని మాట్లాడుతూ.. ఆజాద్‌ను తన నిజమైన స్నేహితుడిగా పేర్కొన్నారు. ‘నా నిజమైన మిత్రుడిని అంత త్వరగా రిటైర్ కానివ్వను. నీ సలహాలు, సూచనలు తీసుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నీ కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అంటూ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఆజాద్ కూడా మోదీపై ప్రశంసలు కురిపించారు. 

Updated Date - 2021-03-01T03:08:39+05:30 IST