ltrScrptTheme3

Telanganaలో కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. సీనియర్ నేత రాజీనామా..

Oct 26 2021 @ 07:42AM

హైదరాబాద్ సిటీ/మౌలాలి : మల్కాజిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఆకుల రాజేందర్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కౌన్సిలర్‌గా, సెంట్రల్‌ ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యునిగా, 2009లో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా ప్రతిని సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఫ్యాక్స్‌, మెయిల్‌ ద్వారా పంపించినట్లు తెలిపారు.

Follow Us on:

హైదరాబాద్మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.