V Hanumanth rao comments: రేవంత్ క్షమాపణలపై కోమటిరెడ్డి ఆలోచించాలి
ABN , First Publish Date - 2022-08-13T18:07:55+05:30 IST
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు స్పందించారు.
హైదరాబాద్: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkatreddy)కి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Ravanth reddy) క్షమాపణలు చెప్పడంపై కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత వి.హనుమంత్ రావు(V.hanumanth rao) స్పందించారు. రేవంత్ రెడ్డి (Revanth Apology) క్షమాపణలు చెప్పారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచనలు చేయాలన్నారు. పార్టీ నుండి ఎవరు బయటకు వెళ్లకుండా ఒక సీనియర్ నాయకుడిగా తాను ఆపే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకి అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. ‘‘నేను కోమటిరెడ్డి తో మాట్లాడతా.. పీఏసీ సమావేశంలో పార్టీ అంతర్గత విషయాలు చర్చిస్తా’’ అని వి.హనుమంతరావు తెలిపారు.