Manikam Tagore Tweet: హరీష్‌రావు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?

ABN , First Publish Date - 2022-09-02T14:43:01+05:30 IST

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కు.ని ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మానికం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Manikam Tagore Tweet: హరీష్‌రావు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి (Ibrahimpatnam Government Hospital)లో కు.ని ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మానికం ఠాగూర్ (Manikam Tagore) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘పోర్చుగల్‌లో భారతీయ గర్భిణి మృతికి బాధ్యత వహిస్తూ అక్కడి వైద్య శాఖా మంత్రి రాజీనామ చేశారు. తెలంగాణ (Telangana)లో ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందారు. మరి తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు(Harish rao) మంత్రి (Telangana health minister) పదవికి రాజీనామా చేస్తారా?’’ అంటూ ఠాగూర్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2022-09-02T14:43:01+05:30 IST