Congress Working Committee: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల

ABN , First Publish Date - 2022-08-28T22:05:50+05:30 IST

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల తేదీ వచ్చేసింది. వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎ

Congress Working Committee: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల తేదీ వచ్చేసింది. వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ ఒకటిన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహర్ణకు అక్టోబర్ 8 చివరి తేదీ. అక్టోబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న కౌంటింగ్ ఉంటుంది. అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. సీడబ్ల్యూసీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జై రాం రమేశ్ వెల్లడించారు. 





వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు హాజరయ్యారు. 


గులాం నబీ ఆజాద్ సహా పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో... ప్రస్తుతం ఉన్న నేతల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవికి సమర్థుడని అంతా అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన మాత్రం రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారు. 



Updated Date - 2022-08-28T22:05:50+05:30 IST