M Kharge vs Piyush Goyal : పార్లమెంట్ సెషన్ వేళ ఈడీ సమన్లా?.. కేంద్రంపై మల్లికార్జున్ ఖర్గే మండిపాటు

ABN , First Publish Date - 2022-08-04T21:43:58+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో ఈడీ(ED) తనకు సమన్లు జారీ చేయడంపై రాజ్యసభ (Rajyasabha) ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్(Congress) సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) మండిపడ్డారు.

M Kharge vs Piyush Goyal : పార్లమెంట్ సెషన్ వేళ  ఈడీ సమన్లా?.. కేంద్రంపై మల్లికార్జున్ ఖర్గే మండిపాటు

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో ఈడీ(ED) తనను విచారణకు పిలవడంపై  రాజ్యసభ (Rajyasabha) ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్(Congress) సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) మండిపడ్డారు. పార్లమెంట్ సెషన్ కొనసాగే సమయంలో నోటీసులు ఎలా జారీ చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభ జరిగే వేళ మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణకు హాజరవ్వాలనడం ఎంతమాత్రం సబబుకాదన్నారు. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లను ఇప్పటికే ప్రశ్నించారని ప్రస్తావించారు. చట్టానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నానని, అయితే పార్లమెంట్ సెషన్(Parliament) మధ్యలో విచారణకు పిలవడం సరైనదేనా అని ప్రశ్నించారు. ‘‘ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇళ్లను నిన్న(బుధవారం) పోలీసులు చుట్టుముట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం బతికే ఉంటుందా?. రాజ్యాంగానుసారం పనిచేయగలమా?. మేము భయపడం. ఈ అంశంపై యుద్ధం చేస్తాం’’ అని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.


మల్లికార్జున్ ఖర్గే విమర్శలపై కేంద్రమంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్(Piyush Goyal) స్పందించారు. చట్టబద్ధ దర్యాప్తు సంస్థల విషయంలో తమ ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని అన్నారు. వారి(కాంగ్రెస్) పాలనలో ఇలా వ్యవహరించి ఉండొచ్చని ప్రత్యారోపణ చేశారు. ఎవరు ఎలాంటి తప్పు చేసినా ఏజెన్సీలు వాటి పని అవి చేసుకుపోతుంటాయని చెప్పారు. కాగా సోదాలు చేయడానికి వీలుగా కార్యాలయాన్ని తెరవడానికి రావాలంటూ యంగ్‌ ఇండియన్‌ కార్యాలయ ప్రధాన అధికారి, పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గేకు ఈడీ ఈ-మెయిల్‌ పంపింది. కానీ, దానికి ఎలాంటి స్పందనా రాలేదని సమాచారం. ఆయన ఎప్పుడు వచ్చి సోదాలు ముగియడానికి సహకరిస్తారో అప్పుడు సీల్‌ తీసేస్తామని ఈడీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గే ఘాటుగా స్పందించారు. 

Updated Date - 2022-08-04T21:43:58+05:30 IST