గృహిణులే అతని టార్గెట్.. రూ.2 కోట్ల స్కామ్.. అదెలాగంటే

ABN , First Publish Date - 2021-12-25T06:40:49+05:30 IST

మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్.. అధిక రాబడీ.. లేద అధిక వడ్డీ ఆశ చూపి 39 మహిళలను ఒక మోసగాడు నిండా ముంచాడు. వారి వద్ద నుంచి దాదాపు రూ.2 కోట్లు పెట్టుబడిగా తీసుకొని మాయమయ్యాడు...

గృహిణులే అతని టార్గెట్.. రూ.2 కోట్ల స్కామ్.. అదెలాగంటే

మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్.. అధిక రాబడీ.. లేద అధిక వడ్డీ ఆశ చూపి 39 మహిళలను ఒక మోసగాడు నిండా ముంచాడు. వారి వద్ద నుంచి దాదాపు రూ.2 కోట్లు పెట్టుబడిగా తీసుకొని మాయమయ్యాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.


ఢిల్లీకి చెందిన మనీష్ కుమార్ సింగ్(48) 2018 సంవత్సరంలో కొత్తగా బిజినెస్ ప్రారంభించాడు. మల్టీ కార్పొరేషన్ కంపెనీలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీ లేదా రాబడి వస్తుందని నమ్మించాడు. ముఖ్యంగా గృహిణులుగా ఉన్న మహిళలను టార్గెట్ చేశాడు. ఇంట్లో నుంచే సంపాదించవచ్చునని చెప్పాడు. వారు పెట్టిన పెట్టుబడులకు కొన్ని నెలల వరకు అధిక శాతం వడ్డీ కూడా ఇచ్చాడు. అది చూసి చాలా మంది అతని వద్ద పెట్టుబడులు పెట్టారు. 


కానీ ఏడాది తరువాత 2019లో ఒక్కసారిగా అతన మాయమయ్యాడు. అతడిని నమ్మి డబ్బులిచ్చిన వారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి మనీష్ కోసం గాలిస్తున్న పోలీసులకు హర్యానాలో కూడా ఇలాగే ఒక స్కీమ్ నడుస్తోందని సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని దర్యాప్తు చేయగా.. మనీష్ అక్కడ ఇదే బిజినెస్ ప్రారంభించాడు. ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేసి చీటింగ్ కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-12-25T06:40:49+05:30 IST