ఐలమ్మ పోరాటంతో రజకుల్లో చైతన్యం

Sep 27 2021 @ 00:54AM
చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 26: తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చాకలి ఐలమ్మ న్యాయపరంగా చేసిన ఉద్యమంలో రజకుల్లో చైతన్యం కలిగిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం చాకలి ఐలమ్మ 126వ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రిమ్స్‌ ఎదుట అధికారంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జోగు రామన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఐలమ్మకు అరుదైన గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రజకుల ఆశయ సాధన కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కాగా, రజకుల విన్నపం మేరకు ఖానాపూర్‌ ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇందులో అదన పు కలెక్టర్‌ నటరాజన్‌, సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, తదితరులున్నారు.

తలమడుగు: మండలంలోని కుచ్లాపూర్‌, లింగి, సుంకిడి, తలమడుగు, రుయ్యాడి తదితర గ్రామాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె చేసిన పోరాటంతోనే నేడు ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. ఇందులో సర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ సత్యపాల్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ రైతు సంఘం జిల్లా నాయకుడు కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు.

ఉట్నూర్‌:మండలంలోని దంతన్‌పల్లిలో చాకలి ఐలమ్మ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. దంతన్‌పల్లి టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు సులేమాన్‌, జిల్లా నాయకులు దాసండ్ల ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్‌ మునీర్‌, సలీం, సందీప్‌రెడ్డి, ఇబ్రహిం, యేసు, శ్రీను, మహేష్‌బాబు, ఫారుక్‌, నవీన్‌, వహీద్‌, హమ్మద్‌, అనిఫ్‌, షారీఫ్‌, నజీర్‌, సురేష్‌, రవి, మోతిలాల్‌ పాల్గొన్నారు.  

నేరడిగొండ: తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని జడ్పీటీసీ అనిల్‌జాదవ్‌ అన్నారు. ఆదివార జడ్పీటీసీ నివాసంలో ఆమె చిత్రపటం వద్ద నాయకులు నివాళులర్పించారు. ఇందులో ఎంపీపీ సజన్‌, వీడీసీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ దేవేందర్‌రెడ్డి, ఎంపీటీస మహేందర్‌రెడ్డి, ఎక్స్‌ ఎంపీటీసీ డా.జహీర్‌, కన్వీనర్‌ శివరెడ్డి, కపిల్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

బోథ్‌: చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు పోవాలని సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం బోథ్‌లోని రజక సంఘం కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో పలువురు రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.

బోథ్‌రూరల్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఆదివారం మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మండలంలోని ధన్నూర్‌ గ్రామంలో జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణలో భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం రజకార్లకు ఎదురొడ్డి నిలిచిన వీరవనితా అని తెలిపారు. ఇందులో జడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ తాహెర్‌బిన్‌ సలాం, ఆత్మ చైర్మన్‌ మల్లెపూల సుభాష్‌, నాయకులు ఎల్కరాజు, నారాయణరెడ్డి, బుచ్చన్న, భీరంరవీందర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాంసి: చాకలి ఐలమ్మ చేసిన సేవలు మరువలేనివని ఆమె ఆశయ సాధన కోసం కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రజకుల సమస్యల సాధన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఐలమ్మ చేసిన సేవలను ఏ ఒక్కరు మరువరాదన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, సర్పంచ్‌ కృష్ణ, వెంకన్న, యశ్వంత్‌, నాయకులు పరమేశ్వర్‌, దారుట్ల విలాస్‌, బి.గంగారాం, కాంతుల్‌, గోవర్ధన్‌రెడ్డి, నాగరెడ్డి, రజక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఆశణ్న, లస్మయ్య ఉన్నారు.

ఇచ్చోడ: నిజాం నవాబులను, రజకార్ల సైన్యం చేస్తున్న అరచకాన్ని గుండె ధైర్యంతో ఎదుర్కొన్న వీరనారి చాకలి ఐలమ్మ అన్ని టీఆర్‌యస్‌ మండల కన్వీనర్‌ ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు అరుగుల గణేష్‌, టీఆర్‌యస్‌ నాయకులు, భాస్కర్‌ రెడ్డి, డుక్రే సుభాష్‌పాటిల్‌, రవీందర్‌, అనిల్‌, భూమన్న, దేవరాజు, శేఖర్‌ ఉన్నారు

బజార్‌హత్నూర్‌: మండలంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులు చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బతికున్నంత వరకూ పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

Follow Us on: