వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే కుట్ర

ABN , First Publish Date - 2020-09-23T05:57:24+05:30 IST

కేంద్రప్రభుత్వం దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకునేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ దేశంలో వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే కుట్రలో

వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే కుట్ర

ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు లాల్‌కుమార్‌ 


మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 22: కేంద్రప్రభుత్వం దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకునేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ దేశంలో వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమేనని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు లాల్‌కుమార్‌ అన్నారు.  కంపెనీలకు లాభం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ దీన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆర్డినెన్స్‌ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


దేశం ఒక వైపున  కరోనా మహమ్మారితో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి జీవనాధారం గా ఉన్న వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరించడం సరికాదని చెప్పారు. ముఖ్యంగా  కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరిట వ్యవసాయాన్ని కార్పొరేట్ల దోపిడీకి గేట్లు తెరవడానికి చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, టి. శ్రీనివాస్‌, మల్లన్న, సురేందర్‌, ప్రవీణ్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T05:57:24+05:30 IST