రైతు డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ మోసంచేసే కుట్ర

ABN , First Publish Date - 2022-05-14T06:51:41+05:30 IST

కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ కేవలం రైతు లను మోసం చేసే కుట్రలో భాగమేనని రాష్ట్ర దేవాదాయ, అటవీ, న్యాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

రైతు డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ మోసంచేసే కుట్ర
సిర్గాపూర్‌లో మాట్లాడుతున్న మంత్రి అల్లోల

రైతులకు అండగా ఉండేది టీఆర్‌ఎస్సే 

రాష్ట్ర దేవాదాయ, శాఖల మంత్రి అల్లోల

దిలావర్‌పూర్‌, మే 13 : కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ కేవలం రైతు లను మోసం చేసే కుట్రలో భాగమేనని రాష్ట్ర దేవాదాయ, అటవీ, న్యాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని సిర్గాపూర్‌లో రూ.పదిలక్షలతో నిర్మించిన మహాలక్ష్మి దేవాలయం, రూ.ఆరులక్షలతో నిర్మించి న పశు వైద్యశాలను ప్రారంభించారు. మహాలక్ష్మి అమ్మవారికి మంత్రి అల్లోల ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. అందుకోసమే ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక కాంగ్రెస్‌, బీజేపీలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ పూర్తిగా మోసపూరిత మైందన్నారు. డిక్లరేషన్‌ పేరుతో ఓట్లు దండుకునే కుట్రకు కాంగ్రెస్‌ తెర లేపిందన్నారు. రైతుల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేని విషయం గుర్తించాలన్నారు. రైతులకు అండగా ఉండేది కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీయేనని అన్నారు. రైతుల సంక్షేమం పట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనమే రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ పథతకాలని అన్నారు. భవిష్యత్తులో రైతుల కోసం మరిన్ని పథకాలు అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికా రంలో ఉన్నప్పుడు రైతులను పూర్తిగా విస్మరించి, ఇప్పుడు డిక్లరేషన్‌ అంటోం దని అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లోని అంశా లను ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చూపాలన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ కనుమరుగు కావడం ఖాయమన్నారు. రైతులకు సాగు నీరు అందించాలన్న ఉద్దేశ్యంతో చేపట్టిన హైలెవల్‌ కెనాల్‌ పనులను అడ్డుకు న్న వారికి బుద్ధి చెప్పాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా రైతుల కోసం చేపట్టిన హైలెవల్‌ కెనాల్‌ నిర్మా ణం పనులను అడ్డుకున్న వారు రేపు రైతుల కోసం ఏం చేస్తారో మీరే ఆలో చించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ గంగారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పీవీ రమణారెడ్డి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు సుభాష్‌రావు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే.దేవేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ సాయరెడ్డి, కదిలి దేవస్థానం చైర్మన్‌ భుజంగ్‌రావు పటేల్‌, అనిల్‌, ఎలుగు రాజేశ్వర్‌, ఎంపీడీవో మోహన్‌, తహసీల్దార్‌ కరీం, తదితరులు పా ల్గొన్నారు. 

శతాధిక వృద్ధురాలి మృతి.. నివాళులర్పించిన మంత్రి అల్లోల

నిర్మల్‌ రూరల్‌, మే 13 : చిట్యాల సర్పంచ్‌ రమేష్‌రెడ్డి నాయనమ్మ పడ కంటి చిన్నవ్వ(104) శతాధిక వృద్ధురాలు మరణించారు. చిన్నవ్వ భౌతిక కాయానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. చిన్నవ్వ ఆత్మకుసద్గతులు కలగాలని ప్రార్థించారు. అనంతరం చిన్నవ్వ అంత్యక్రియలకు హాజరయ్యారు. 

Read more