సహకారరంగాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్ర

ABN , First Publish Date - 2022-06-26T06:39:57+05:30 IST

దేశంలో రైతాంగాన్ని ఆదుకుంటున్న సహకార రంగాన్ని ప్రైవేట్‌ప రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టీ ఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శనివారం భువనగిరిలోని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలు ఎల్‌ఐసీతోపాటు రైల్వే, విమాన సేవలను ప్రైవేట్‌పరం చేసిందన్నారు.

సహకారరంగాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న కంచర్ల రామకృష్ణారెడ్డి

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి 

యాదాద్రి, జూన్‌25(ఆంధ్రజ్యోతి): దేశంలో రైతాంగాన్ని ఆదుకుంటున్న సహకార రంగాన్ని ప్రైవేట్‌ప రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టీ ఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శనివారం భువనగిరిలోని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలు ఎల్‌ఐసీతోపాటు రైల్వే, విమాన సేవలను ప్రైవేట్‌పరం చేసిందన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేశాక, ఇక పరిపాలన ఏముంటుందని ప్రశ్నించా రు. రైతులకు అండగా ఉన్న సహకార రంగంలోకి కేం ద్రం ప్రైవేట్‌ పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమవుతోందన్నారు. సహకారరంగాన్ని ప్రైవేట్‌పరం చేయడం వల్ల రైతులకు ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతాయని, సన్న, చిన్నకారు రైతులకు రుణాలు కూడా అందని పరిస్థితి నెలకొంటుందన్నారు. రానున్న రోజుల్లో డీసీసీబీ, పీఏసీఎ్‌సల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కానున్నాయని తెలిపారు. సమావేశంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు కొ లుపుల అమరేందర్‌, భువనగిరి మునిసిపల్‌ చైర్మన్‌ ఆం జనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:39:57+05:30 IST