ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర

ABN , First Publish Date - 2022-07-06T06:58:59+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏబీవీపీ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ సుర్వి మణికంఠ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర
భువనగిరిలో మాట్లాడుతున్న ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ మణికంఠ

 ఏబీవీపీ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ మణికంఠ 

జిల్లా వ్యాప్తంగా ఏబీవీపీ బంద్‌ విజయవంతం

భువనగిరి టౌన్‌, జూలై 5: ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏబీవీపీ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ సుర్వి మణికంఠ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిం చాలని, వెంటనే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం సరఫరా చేయాలని డిమాండ్‌తో మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాలల బంద్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలను పరోక్షంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేటీకీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సరఫరా చేయలేదని ఆయన ఆరోపించారు.  ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు  ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లవెల్లి శివ, సాయికుమార్‌, వినయ్‌ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

పోరాటాలు కొనసాగిస్తాం: ఏబీవీపీ

మోటకొండూరు: పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఏబీవీపీ జిల్లా నాయకుడు ఉపేందర్‌ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన విద్య సంస్థల బంద్‌ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యాసంస్థలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా విద్యార్థులకు దుస్తులు, నోట్‌ పుస్తకాలు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.కార్యక్రమంలో మల్గ రాములు, మురళీకృష్ణ, ఎండీ సోయల్‌, రేవంత్‌, గంధమల్ల సైదులు, గడ్డం రమేశ్‌, శ్రీకాంత్‌, మధు, ఆడెపు స్వామి, మంచాల కుమార్‌, గుర్రాల కోటేశ్‌, వెంకన్నలు పాల్గొన్నారు. 

మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం

వలిగొండ: ప్రభుత్వ పాఠశాలలను మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని  ఏబీవీపీ నాయకుడు హరీష్‌ అన్నారు.  మండలంలో నిర్వహించిన బంద్‌ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో నాయకులు హరీష్‌, సతీష్‌, బాలు, తదితరులు పాల్గన్నారు.

ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి 

మోత్కూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ  ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ సుర్వి మణికంఠ అన్నారు.  ఏబీవీపీ ఆధ్వర్యంలో  మోత్కూరు మండల కేంద్రంలో, దత్తప్పగూడెంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూయించారు. విద్యార్థులకు  వెంటనే పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందించాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో  గునగంటి శ్రీధర్‌, మురారిశెట్టి అనిల్‌, గుంటి సతీష్‌, ఉపేందర్‌, అమీర్‌, నరేష్‌, జాన్‌, మత్స్యగిరి, నవీన్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-06T06:58:59+05:30 IST