Viral Video: బూటు కాలుతో ముఖంపై తన్ని.. వృద్ధుడి కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. 2 కారణాలు చెబుతున్న అధికారులు!

ABN , First Publish Date - 2022-07-30T15:30:02+05:30 IST

ఆ వృద్ధుడికి సుమారు 60ఏళ్ల వయసు ఉంటుంది. అతడిపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. బుటు కాలుతో ఇష్టం వచ్చినట్టు తన్ని.. పట్టాల వద్దకు ఈడ్చుకెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెటింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవు

Viral Video: బూటు కాలుతో ముఖంపై తన్ని.. వృద్ధుడి కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. 2 కారణాలు చెబుతున్న అధికారులు!

ఇంటర్నెట్ డెస్క్: ఆ వృద్ధుడికి సుమారు 60ఏళ్ల వయసు ఉంటుంది. అతడిపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. బుటు కాలుతో ఇష్టం వచ్చినట్టు తన్ని.. పట్టాల వద్దకు ఈడ్చుకెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెటింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఆ పెద్దాయన ఏదైనా తప్పు చేసుంటే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాని ఇలా కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఉన్నతాధికారులు మాత్రం.. సదరు కానిస్టేబుల్ అలా ప్రవర్తించడానికి రెండు కారణాలు చెబుతున్నారు. అవి ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) లోని జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌(Railway Station) లో విధులు నిర్వహిస్తున్న రైల్వే కానిస్టేబుల్‌(Constable ) వృద్ధుడిని చితకబాదాడు. బూటు కాలితో అతడి ముఖం.. ఇతర శరీర భాగాలపై తన్నాడు. అనంతరం అతడిని పట్టాల వద్దకు ఈడ్చుకెళ్లి.. ప్లాట్‌ఫాం వద్ద తలకిందులుగా వేలాదీశాడు. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న కొందరు ప్రయాణికులు.. తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేశారు. అదికాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 



ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. బాధితుడిని నార్సింగ్‌పూర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆర్పీఫ్(RPF) చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అరుణ్ త్రిపాఠి మాట్లాడుతూ.. సదరు వృద్ధుడు ట్రెయిన్‌లో ఓ ప్రయాణికుడిపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు. ప్రయాణికుడి ఫిర్యాదుతో స్పందించిన కానిస్టేబుల్ వృద్ధుడిపై చేయి చేసుకున్నట్టు వెల్లడించారు. ఇదే సమయంలో జీఆర్‌పీ (GRP) ఎస్పీ వినాయక్ వర్మా మాట్లాడుతూ.. మద్యం మత్తులో వృద్ధుడు మహిళనుపై కామెంట్స్ చేసినట్టు చెప్పారు. అది కానిస్టేబుల్ కంటపడి వృద్ధుడిని అడ్డుకోవడంతో... అతడు అధికారి కాలర్ పట్టుకున్నాడని అన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్.. సదరు వృద్ధుడిని కొట్టాడని తెలిపారు. 




Updated Date - 2022-07-30T15:30:02+05:30 IST