బొట్టు పెట్టుకుందన్న కారణంగా మహిళా ప్రొఫెసర్‌కు కానిస్టేబుల్ వేధింపులు..! చివరకు..

ABN , First Publish Date - 2022-04-05T23:24:43+05:30 IST

బొట్టు పెట్టుకున్న కారణంగా ఓ మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన కానిస్టేబుల్‌ను చివరికి పోలీసులు అరెస్టు చేశారు.

బొట్టు పెట్టుకుందన్న కారణంగా మహిళా ప్రొఫెసర్‌కు కానిస్టేబుల్ వేధింపులు..! చివరకు..

ఎన్నారై డెస్క్: నుదుట బొట్టు పెట్టుకున్న కారణంతో ఓ మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన కానిస్టేబుల్‌ను చివరికి పోలీసులు అరెస్టు చేశారు. బాంగ్లాదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఢాకా మెట్రోపాలిటిన్ పోలీసులు నిందితుడు నజ్మల్ తారేఖ్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ప్రొ.లోటా సుమద్దార్ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు నజ్మల్‌ను అదుపులోకి తీసుకున్నారు.


రాజధాని ఢాకాలో తేజ్‌గావ్ కాలేజీలో థియేటర్ అండ్ మీడియా స్టడీస్ విభాగంలో లోటా అధ్యపకురాలిగా ఉన్నారు. బొట్టు పెట్టుకున్నందుకు తనను కానిస్టేబుల్ వేధింపులకు దిగాడని ఆమె ఆరోపించారు. అతడి వేధింపులను అడ్డుకోబోతే.. బైక్‌తో తనను ఢీకొట్టే ప్రయత్నం చేశాడని చెప్పారు. అదృష్టవశాత్తూ..తాను సమయానికి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పిందని, అయితే.. ఈ ప్రయత్నంలో తాను నేలపై పడిపోవడంతో గాయాలయ్యాయని తెలపారు. ఆ కానిస్టేబుల్ కారణంగా తను అభద్రతకు లోనవుతున్నట్టు ఫిర్యాదు చేశారు. ఇక.. బాధితురాలి ఆరోపణల్లో నిజం ఉన్నట్టు ప్రాథమింకంగా తేలడంతో పోలీసులు కానిస్టేబుల్ నజ్మల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వేధింపులకు పాల్పడటం, దూషణలకు పాల్పడుతూ భౌతికంగా దాడికి దిగడం వంటి అభియోగాలతో నిందితుడిపై కేసు నమోదైంది. 


మరోవైపు.. ఈ ఘటన ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అనేక ప్రాంతాల్లో ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. ‘‘బొట్టు పెట్టుకోకూడది బాంగ్లాదేశ్ రాజ్యాంలో ఉందా లేదా మరేదైనా చట్టంలో ఉందా..? అంటూ ప్రముఖ నటి చట్టసభ సభ్యురాలు సుబోర్నా ముస్తాఫా తీవ్ర ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు నిందితుడిని శిక్షించాలంటూ ఆమె పార్లమెంట్ వేదికగా డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-05T23:24:43+05:30 IST