తెలుగు రాష్ట్రాలకో రాజ్యాంగం...

ABN , First Publish Date - 2022-05-05T08:42:16+05:30 IST

జమ్మూకశ్మీర్‌కు ఒక రాజ్యాంగం, మిగతా దేశానికో రాజ్యాంగం ఉండరాదని చెబుతున్న ప్రధాని మోదీ ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ విషయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తెలంగాణ, ఏపీలకు అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు.

తెలుగు రాష్ట్రాలకో రాజ్యాంగం...

జమ్మూకశ్మీర్‌కో రాజ్యాంగమా?: మర్రి

న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌కు ఒక రాజ్యాంగం, మిగతా దేశానికో రాజ్యాంగం ఉండరాదని చెబుతున్న ప్రధాని మోదీ ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ విషయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తెలంగాణ, ఏపీలకు అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. జమ్మూకశ్మీర్‌కు డీలిమిటేషన్‌ కమిషన్‌ రాజ్యాంగ వ్యతిరేకం కానప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమించి ఏపీ విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్లను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఆర్టికల్‌ 170 ప్రకారం 2026వరకు నియోజకవర్గాల పునర్విభజనపై నిషేధం విధించినప్పటికీ జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేయడం రాజ్యాంగ విరుద్ధమని మర్రి శశిధర్‌ రెడ్డి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు.

Read more