గాంధీ మార్కెట్‌లో సీసీ రోడ్డు నిర్మాణం

ABN , First Publish Date - 2022-07-07T06:49:16+05:30 IST

పట్టణంలోని గాంధీ మార్కెట్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి వెంటనే ప్రతిపాదన సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా అధికారులను ఆదే శించారు. అనకాపల్లి జోన్‌లోని గాంధీమార్కెట్‌, కన్యకాపరమేశ్వరి రోడ్డు ప్రాంతాల్లో బుధవారం పర్య టించి మాట్లాడారు.

గాంధీ మార్కెట్‌లో సీసీ రోడ్డు నిర్మాణం
జీవీఎంసీ తయారు చేసిన గుడ్డ సంచులను ఆవిష్కరిస్తున్న కమిషనర్‌ లక్ష్మీషా


 జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీషా వెల్లడి  ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం 

 పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటన

అనకాపల్లి టౌన్‌, జూలై 6 :  పట్టణంలోని గాంధీ మార్కెట్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి వెంటనే ప్రతిపాదన సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా అధికారులను ఆదే శించారు. అనకాపల్లి జోన్‌లోని గాంధీమార్కెట్‌, కన్యకాపరమేశ్వరి రోడ్డు ప్రాంతాల్లో బుధవారం పర్య టించి మాట్లాడారు.  గాంధీమార్కెట్‌ రోడ్డు శిథిలావస్థలో ఉన్నందున ఆ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇం జినీరింగ్‌ అధికారులకు ఆదేశించారు. మార్కెట్‌లో దుకాణదారులు, రైతులకు ప్లాస్టిక్‌ వల్ల అనర్థాలను  వివరించారు. నిషేధిత ప్లాస్టిక్‌ను తక్షణమే విడనాడాలన్నారు. మార్కెట్‌లో వాటర్‌ ప్యాకెట్లు అధికంగా కనిపిస్తున్నాయని, వాటిని నిరోధించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదే శించారు. టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లలో చెట్నీలు, కూరల కోసం సిల్వర్‌ కవర్లు వాడుతున్నారని, అవి కూడా వాడకుండా చూడాలన్నారు. మార్కెట్‌ కమి టీలు ప్లాస్టిక్‌ నిషేధంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.  అనంతరం ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్త్రి, జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, కార్యనిర్వాహక ఇంజనీర్‌ మత్స్యరాజు,  ఇతర ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T06:49:16+05:30 IST