రామగుండంలో హరిత హోటల్‌ నిర్మాణాన్ని చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-20T05:19:35+05:30 IST

రామగుండంలో హరితహోటల్‌ నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌రావును రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు.

రామగుండంలో హరిత హోటల్‌ నిర్మాణాన్ని చేపట్టాలి
టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

- టూరిజం ఎండీని కోరిన రామగుండం ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, మే 19: రామగుండంలో హరితహోటల్‌ నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌రావును రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. గురువారం టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఎండీని కలిసి వినతిపత్రం అందజేశారు. గోదావరిఖని కవితా థియేటర్‌ సమీపంలో హరిత హోటల్‌ నిర్మాణానికి స్థలసేకరణ కూడా చేశా రని, అక్కడ పనులను చేపట్టాలని, రామగుండం టూరిజంహబ్‌గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో హరితహోటల్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని కోరారు.

Updated Date - 2022-05-20T05:19:35+05:30 IST