ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-09-23T05:06:10+05:30 IST

లబ్ధిదారులు తక్ష ణమే గృహనిర్మాణ పనులు ప్రారంభించాలని జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ ప్రసాద్‌ అన్నా రు.

ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి
నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలిస్తున్న ప్రసాద్‌

గృహనిర్మాణ శాఖ పీడీ ప్రసాద్‌ 

బల్లికురవ, సెప్టెంబరు 22: లబ్ధిదారులు తక్ష ణమే గృహనిర్మాణ పనులు ప్రారంభించాలని జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ ప్రసాద్‌ అన్నా రు. గురువారం మండలంలోని ఉప్పుమాగులూ రు, మల్లాయపాలెం గ్రామాలలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలను ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో అయన మాట్లాడుతూ గృహాల  నిర్మాణాలకు సంబంధించి సమస్యలు ఉంటే తెలియజేయలన్నారు. మల్లాయపాలెంలో విద్యుత్‌ సమస్య ఉందని తెలపగా వెంటనే ఆ శాఖ అధికారులతో మాట్లాడారు 

అనంతరం ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా ఇసుక, వి ద్యుత్‌, నీటి వసతి వంటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. గతంలో గృహా ల పనులు ప్రారంభించిన వారు అక్టోబరు 15కు పూర్తి చేయాలన్నారు. ఇంతవరకు పనులు ప్రారంభించని వారు వెంటనే పనులు మొదలు పెట్టి నవంబ రు 15కల్లా పనులు పూర్తి చేయాలన్నారు. పనులు చేసిన వెంటనే ప్రభుత్వం బిల్లు లు చెల్లిస్తుందని చెప్పారు.

తదనంతరం బల్లికురవ ఎంపీడీవో కా ర్యాలయంలో సచివాలయ ఇంజనీరింగ్‌ అ సిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, గృ హనిర్మాణ శాఖ సిబ్బందితో పీడీ ప్రసాద్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా ఎన్ని గృహాల పనులు చేపట్టారు,  ఎంతమంది పనులు చేసేందుకు ముందుకు రా వటం లేదనే వివరాలను సేకరించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకుంటే నివే శన స్థలాలు, గృహాలు రద్దవుతాయని లబ్ధిదారులకు తెలియజే యాల న్నారు. సమావేశంలో  ప్రత్యేకాధికారి వెంకట్రావు, ఈఈ దాశరధివర్మ, ఎంపీడీవో సీహెచ్‌ కృష్ణ, ఏఈ కిషోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-23T05:06:10+05:30 IST