రూ.50 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణం

ABN , First Publish Date - 2022-05-22T04:58:49+05:30 IST

హుస్నాబాద్‌ పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో రూ.50 లక్షలతో నూతన గ్రంథాలయ భవనాన్ని త్వరితగతిన నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు.

రూ.50 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అందుబాటులో పుస్తకాలు 

ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ 

హుస్నాబాద్‌, మే 21 : హుస్నాబాద్‌ పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో రూ.50 లక్షలతో నూతన గ్రంథాలయ భవనాన్ని త్వరితగతిన నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. అందుకు అనుగుణంగా పనుల ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. శనివారం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో తాత్కాలిక గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు దాదాపు రూ.1 లక్ష విలువైన పుస్తకాలను అందుబాటులో పెట్టామన్నారు. ఈ గ్రంథాలయాన్ని అభ్యర్థులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, రుణ విముక్తి కమిషన్‌ సభ్యులు కవ్వ లక్ష్మారెడ్డి, ఎంపీపీలు మానస, లక్ష్మి, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

హుస్నాబాద్‌ పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌,, టీఆర్‌ఎస్‌ ఇన్సూరెన్స్‌ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జూన్‌ 1వ తేదీన 30 ఏళ్లు దాటిన మహిళలకు నిర్వహిస్తున్న 5కే రన్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ ఆవిష్కరించారు. ఇందులో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐ శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T04:58:49+05:30 IST