మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు షురూ

ABN , First Publish Date - 2021-10-08T05:14:51+05:30 IST

ఎట్టకేలకు మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హంగూ ఆర్భాటం లేకుండా సంగారెడ్డిలోని డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలో గురువారం పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు.

మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు షురూ

సంగారెడ్డిఅర్బన్‌, అక్టోబరు7: ఎట్టకేలకు మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హంగూ ఆర్భాటం లేకుండా సంగారెడ్డిలోని డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలో గురువారం పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణలోనే ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణంలో భాగంగా ముందుగా ఓబ్లాక్‌ నిర్మించనున్నారు. జీ+2 సామర్థ్యంతో బ్లాక్‌ నిర్మాణం చేపట్టనున్నారు. అందులో తరగతి గదులు, స్టాఫ్‌హాల్‌, ఆఫీస్‌ రూమ్స్‌, హాల్స్‌ తదితర పాలనాపరమైన గదులు నిర్మించనున్నారు. సుమారు 90 వేల ఎస్‌ఎ్‌ఫటీ సామర్థ్యంలో మొదటి బ్లాక్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఆరునెలల కాలంలో మొదటిబ్లాక్‌ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-10-08T05:14:51+05:30 IST