ఆరోగ్య కేంద్రానికి రహదారి నిర్మాణం

ABN , First Publish Date - 2021-03-01T05:00:14+05:30 IST

ఎట్టకేలకు ఇటిక్యాల మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రానికి రహదారి నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఈ ఆసుపత్రిని 25 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు.

ఆరోగ్య కేంద్రానికి రహదారి నిర్మాణం
తుదిదశకు చేరిన సీసీ రోడ్డు నిర్మాణం

- 25 ఏళ్ల సమస్యకు పరిష్కారం

ఇటిక్యాల పిబ్రవరి 28 : ఎట్టకేలకు ఇటిక్యాల మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రానికి రహదారి నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఈ ఆసుపత్రిని 25 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కానీ ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు పొలాల్లోంచి రహదారి నిర్మించాల్సి ఉంటుంది. అందుకు రైతులు అంగీకరించలేదు. దీంతో పాతికేళ్లుగా ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు. ఇటీవల స్థానిక నాయకులు, అధికారులు రైతులతో జరిపిన చర్చలు ఫలించాయి. ఆసుపత్రికి సమీపంలో ఉన్న పాఠశాల ప్రహరీ వెంట 30 ఫీట్ల వెడల్పు, 120 మీటర్ల పొ డవున రోడ్డు నిర్మాణానికి రైతులు అంగీకరించారు. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేశారు. ముందుగా మట్టిరోడ్డు వేసి, అనంతరం సీసీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు. 

Updated Date - 2021-03-01T05:00:14+05:30 IST