రూ.కోటీ 42 లక్షలతో పాఠశాలల్లో వసతుల కల్పన

ABN , First Publish Date - 2022-05-16T06:34:02+05:30 IST

బోథ్‌ నియోజక వర్గంలోని పాఠశాలల నిర్మాణం, వసతుల కల్పన కోసం రూ.కోటీ 42లక్షల వ్యయంతో పాఠశాలల్లో మౌలిక వసతి కల్పించి విద్యార్థులకు ఏర్పాట్లు చేస్తామని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పొచ్చెర, కౌఠ(బి) గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు

రూ.కోటీ 42 లక్షలతో పాఠశాలల్లో వసతుల కల్పన
కజ్జర్లలోని పాఠశాలలో భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే బాపురావు

గ్రామాల్లో భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బాపురావు

బోథ్‌, మే 15: బోథ్‌ నియోజక వర్గంలోని పాఠశాలల నిర్మాణం, వసతుల కల్పన కోసం రూ.కోటీ 42లక్షల వ్యయంతో పాఠశాలల్లో మౌలిక వసతి కల్పించి విద్యార్థులకు ఏర్పాట్లు చేస్తామని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పొచ్చెర, కౌఠ(బి) గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు పాఠశాలల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. పాఠశాలలకు వెళ్తే ప్రధానోపాధ్యాయులు సమస్యలను వివరించే వారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించాలన్న ధృక్పథంతో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో కౌఠ(బి) గ్రామ సర్పంచ్‌ కొంకటి రాధిక గంగాధర్‌, ఎంపీటీసీ శిరిషాఅశోక్‌రెడ్డి పాఠశాల చైర్మన్‌ గడ్డల రమణ, మండల విద్యాధికారి భూమారెడ్డి, బోథ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దావుల భోజన్న, జడ్పీటీసీ సంధ్యారాని, జడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ తాహెర్‌బిన్‌ సలాం, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ మహిమూద్‌, కౌఠ గ్రామ ఉప సర్పంచ్‌ రవీందర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులున్నారు. 

జాతీయ పార్టీలతో అభివృద్ధి జరగదు

జాతీయ పార్టీలు అధికారంలోకి వస్తే అభివృద్ధి జరగదని, ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బాపురావు అన్నారు. ఆదివారం మండలంలోని కౌఠ(బి) గ్రామంలో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. జాతీయ పార్టీల ముఖ్యమంత్రుల పాలనను తెలంగాణ ప్రజలు చూశారని, తరచూ ముఖ్యమంత్రులను మార్చి అభివృద్ధిని నిరోధిస్తారన్నారు. 

టూరిస్టులతో ఒరిగిందేమీ లేదు

తలమడుగు: తెలంగాణ రాష్ర్టానికి అప్పుడప్పుడు టూరిస్టులు వచ్చి వెళ్తారని, వారితో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని, తెలంగాణ అభివృద్ధే టీఆర్‌ఎస్‌ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు అన్నారు.  ఆదివారం మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. అనంతరం కజ్జర్ల పాఠశాలలో చేపట్టనున్న పనులను భూమిపూజ నిర్వహించారు. ఇందులో డీఈ శివరాజ్‌, సర్పంచ్‌ వెంకటమ్మ, టీఆర్‌ఎస్‌ కన్వీనర్‌ తోట వెంకటేశ్‌, ఉపాధ్యక్షుడు మగ్గిడి ప్రకాష్‌, రైతుబంధు మండల కన్వీనర్‌ జీవన్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌, దేవాపూర్‌ సర్పంచ్‌ అబ్దుల్లా, రత్నాపూర్‌ సర్పంచ్‌ రాంబాయి, ఉప సర్పంచ్‌ ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T06:34:02+05:30 IST