సర్వీసు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి: సీపీఎం

ABN , First Publish Date - 2022-07-07T06:08:24+05:30 IST

చౌటుప్పల్‌లోని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్‌ రోడ్డులో ఉన్నవ్యాపార సముదాయాలు, గృహనిర్మాణాలు వరద ముంపునకు గురి కాకుండా చెరువు అలుగు నీరు పోయే విధంగా సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

సర్వీసు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి: సీపీఎం
ధర్నా నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

చౌటుప్పల్‌, జూలై 6: చౌటుప్పల్‌లోని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్‌ రోడ్డులో ఉన్నవ్యాపార సముదాయాలు, గృహనిర్మాణాలు వరద ముంపునకు గురి కాకుండా చెరువు అలుగు నీరు పోయే విధంగా సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.  ఈమేరకు సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సర్వీస్‌ రోడ్డులో అస్తవ్యస్తంగా ఉన్న గుంతలను వెంటనే పూడ్చి వేయాలని డిమాండ్‌ చేశారు. జీఎంఆర్‌ సంస్థ సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు వాహనదారులు నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సర్వీస్‌ రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తంగడపల్లి రోడ్డులో చేపట్టిన రోడ్డు నిర్మాన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం ఆర్‌ర్డీవో సూరజ్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన బత్తుల శ్రీశైలంగౌడ్‌, జిల్లా కమిటీ సభ్యుడు ఎండి.పాష, నాయకులు బండారు నరసింహ, గోపగోని లక్ష్మణ్‌గౌడ్‌, దండ అరుణ్‌ కుమార్‌, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, ఎర్ర ఊశయ్య, మదార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T06:08:24+05:30 IST