ఇంటి నిర్మాణాలను ప్రారంభించాలి: పీడీ

ABN , First Publish Date - 2021-04-24T04:51:10+05:30 IST

వైఎ్‌సఆర్‌ కాలనీలో వైఎ్‌సఆర్‌ ఇంటి నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలని హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణ తెలిపారు.

ఇంటి నిర్మాణాలను  ప్రారంభించాలి: పీడీ


జూపాడుబంగ్లా, ఏప్రిల్‌ 23: వైఎ్‌సఆర్‌ కాలనీలో వైఎ్‌సఆర్‌ ఇంటి నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలని హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణ తెలిపారు. మండలంలోని తర్తూరు గ్రామంలో ఇంటి స్థలాలలో వేసిన బోరును ఆయన శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం నిర్థేశించిన కొలతల్లో ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే అందుకు కావాల్సిన సిమెంటును ప్రభు త్వం అందజేస్తోందని, ఇసుక టోకెన్‌ ఇస్తే లబ్ధిదారులు ఇసుక రీచ్‌లలోకి వెళ్లి ఇసుక తెచ్చుకోవచ్చు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగరాజు, డీఈ ప్రభాకర్‌, ఆర్‌ఏఈ శ్రీనాధ్‌, గ్రామ సర్పంచ్‌ నాగిరెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-04-24T04:51:10+05:30 IST