వినియోగం సున్నా

ABN , First Publish Date - 2021-02-23T04:37:39+05:30 IST

అయిన వారు దూరమైన బా ధ ఒక వైపు..

వినియోగం సున్నా
గోపాల్‌పేట మండలంలో నిర్మించిన వైకుంఠ ధామం

- అలంకారప్రాయంగా దహన వాటికలు

- బరియల్‌ గ్రౌండ్స్‌ను ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు

- కోట్లు ఖర్చు చేసినా నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

- ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖననం చేసే విధానం


వనపర్తి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : అయిన వారు దూరమైన బా ధ ఒక వైపు.. వారికి ప్రశాంతంగా అంత్యక్రియలు చేసే బాధ మరో వై పు.. సొంత స్థలాలు ఉన్న వారు వారి పొలంలోనే అంత్యక్రియలు చేపడు తుండగా.. సొంత స్థలాలు లేని వారికి శ్మశాన వాటికలే దిక్కవుతున్నాయి. అ వి కూడా ఊరూరా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఉపాధి హామీ పథకం కింద దహన వాటికల నిర్మాణానికి పూనుకున్నది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఈ దహన వాటికలు చాలా వరకు ఉపయోగంలోకి రాగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పనులు పూర్తయినా ఉపయోగంలోకి రావడం లేదు. ఇక్కడ ఎక్కువగా ఖననం చేసే సంస్కృతి ఉండటం ఇందుకు కారణంగా చెప్పాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఖననం చేసే సంస్కృతిని అవలంభిస్తుండగా, ఓసీల్లో ఉన్న కొన్ని వర్గాలు మాత్రమే దహన సంస్కృతిని అనుసరిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే 15 శాతం మందికి మాత్రమే ఈ దహన వాటికలు ఉపయోగపడే అవకాశం ఉంది. 

ఉదాహరణకు వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలు ఉన్నాయి. అన్నింటిలో దహన వాటికలు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం రూ.29.6 కోట్లకు పరిపాలనా అ నుమతులు ఇచ్చింది. ఉపాధి హామీ కింద ఆయా పంచాయతీల్లో గ్రామీణాభివృద్ధి శాఖ, పంచా యతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో 253 పంచాయతీల్లో దహన వాటికల నిర్మాణాలు ప్రారంభించారు. ఇందులో 94 పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా 159 నిర్మా ణాలు జరుగుతున్నాయి. పనులు పూర్తయిన దహన వాటికల్లోనూ ఇప్పటి వరకు శవాలను ద హనం చేయడం లేదు. అయితే, దహన వాటికల నిర్మాణాలపై ప్రజాప్రతినిధులు పెదవి విరుస్తు న్నారు. ఉపయోగపడని, సంస్కృతికి భిన్నంగా కార్యక్రమాలు చేయలేమని చెప్పుకుంటున్నారు. దీనికి బదులుగా పూడ్చేందుకు బరియల్‌ గ్రౌండ్స్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


ఆచారానికి కట్టుబడి

ఆయా వర్గాలు వారి వారి సంప్రదా యాలను బట్టి కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల్లో పూడ్చే విధానమో లేదా కాల్చే విధాన మో వేల సంవత్సరాలుగా పాటిస్తున్నారు. పునర్జన్మ, ఆత్మకు శాంతి చేకూరడం వంటి అనేక కారణాలతో ఈ రెండు విధానాలను అవలంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లా సంస్కృతికంగా రాష్ట్రంలోని ఇతర జి ల్లాలతో పోలిస్తే భిన్నమైనది. ఇక్కడ అంత్యక్రియల సమయంలో 85 శాతానికి పైగా ప్రజలు శవాలను పూడ్చే విధానాన్నే అనుసరిస్తారు. కానీ, ప్రభుత్వం అందు కు భిన్నంగా ప్రతీ గ్రామంలో దహన వాటికలను నిర్మిస్తోంది. ఇప్పటికే నిర్మాణాలు చాలా పూర్తయినా, వాటిని ప్డ్రజలెవరూ ఉపయోగించడం లేదు. కొత్తగా ఖనన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నా కొన్ని గ్రామాల్లో స్థలాల కొరత కారణంగా ప్రభు త్వం దహన వాటికల నిర్మాణానికే మొగ్గుచూపింది. ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వా రా దహన వాటికలను ఉపయోగంలోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే, ప్రజలు మా త్రం ఆచారాలను వీడటానికి సిద్ధపడటం లేదు. ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత సర్పం చులపై ఉన్నా, వారు చెప్పినా ప్రజలు అస్సలు ఒప్పుకోవడం లేదు.

Updated Date - 2021-02-23T04:37:39+05:30 IST