‘దిశ’ కేంద్రం నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు

ABN , First Publish Date - 2020-12-02T06:36:37+05:30 IST

నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ‘దిశ’ కేంద్రం (వన్‌ స్టాప్‌ సెంటర్‌)లో పనిచేస్తున్న ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు కె.ఉమారాణి మంగళవారం ఉత్త ర్వులు జారీ చేశారు.

‘దిశ’ కేంద్రం నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు

విజయవాడ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ‘దిశ’ కేంద్రం (వన్‌ స్టాప్‌ సెంటర్‌)లో పనిచేస్తున్న ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు కె.ఉమారాణి మంగళవారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరే టర్లు (ఐటీ), ముగ్గురు సెక్యూరిటీగార్డులు తొల గించినవారిలో ఉన్నారు. దిశ కేంద్రంలో పురుష ఉద్యోగులను కొనసాగించవద్దని తమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, రీజనల్‌ జాయింట్‌ సెక్రటరీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వీరిని విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరి కాంట్రాక్టు పీరియడ్‌ను కలెక్టరు కూడా రెన్యువల్‌ చేయలేదన్నారు. రెండేళ్లుగా తక్కువ జీతాలకే పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుం టున్న తమను ఉన్నట్టుండి నిర్దాక్షిణ్యంగా తొలగిం చడం అన్యాయమని బాధిత ఉద్యోగులు వాపోతు న్నారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నట్టుండి ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయానికి పిలిపించి తొలగింపు ఉత్తర్వులపై బలవంతంగా సంతకాలు చేయించుకుని పంపించేశారని వారు వాపోయారు. ఉన్నతాధికారులు తమపై దయచూ పించి దిశ కేంద్రంలో కాకపోయినా మరో చోటైనా తమకు ఉపాధి చూపించాలని వారు కోరారు.

Updated Date - 2020-12-02T06:36:37+05:30 IST