లారీ టైరు మారుస్తుండగా..

ABN , First Publish Date - 2021-04-17T05:34:35+05:30 IST

లారీ టైరు మారుస్తుండగా వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ క్లీనర్‌ కన్నుమూశాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత నాతవలస టోల్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి డెంకాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

లారీ టైరు మారుస్తుండగా..
ప్రమాదానికి కారణమైన కంటైనర్‌




కంటైనర్‌ ఢీకొని డ్రైవర్‌, క్లీనర్‌ దుర్మరణం

నాతవలస టోల్‌గేటు సమీపంలో ఘటన

 డెంకాడ, ఏప్రిల్‌ 16:లారీ టైరు మారుస్తుండగా వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ క్లీనర్‌ కన్నుమూశాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత నాతవలస టోల్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి డెంకాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీని టోల్‌గేట్‌ సమీపంలో రోడ్డు పక్కన నిలిపివేశారు. డ్రైవర్‌ షాజిత్‌ఖాన్‌ (36), క్లీనర్‌ మహ్మద్‌ ఆసీన్‌ (39)లు టైరు మార్చే పనిలో ఉన్నారు. అదే సమయంలో అతి వేగంతో వస్తున్న కంటైనర్‌ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ షాజిత్‌ఖాన్‌ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న క్లీనర్‌ మహ్మద్‌ ఆసీన్‌ను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం సాయంత్రం ఆయన మృతిచెందారు. మృతులిద్దరూ ఒడిశాలోని ఖుర్ధా జిల్లా బొగగం గ్రామస్థులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సాగర్‌బాబు తెలిపారు.  





Updated Date - 2021-04-17T05:34:35+05:30 IST