Advertisement

సర్వేమాయం!

Jun 30 2020 @ 06:11AM

కంటైన్మెంట్‌ జోన్‌లకే  ‘ఇంటింటా ఫీవర్‌ సర్వే’ పరిమితం

మిగతాచోట్ల తూతూమంత్రం

పర్యవేక్షణ లేక లోపభూయిష్టం 


(కలెక్టరేట్‌): జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. పట్టణాలతో పాటు పల్లెల్లో సైతం అధికంగా నమోదవుతున్నాయి. సామాజిక వ్యాప్తి దిశగా పయనిస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ వస్తోంది. ప్రత్యేక పారిశుధ్య పనులు చేయిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ ప్రాథమిక వైరస్‌ నిర్థారణ పరీక్షలు, కేసుల వెల్లడి, ఇంటింటా ఫీవర్‌ సర్వే, నివేదికలు తదితర వాటిలో స్పష్టత లేకుండా పోతోంది. కంటైన్మెంట్‌ జోన్ల వారికే విటన్నింటినీ చేపట్టి మిగతా చోట్ల చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

తొలినాళ్లలో కేసులు అంతంతమాత్రం. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తరువాత పరిస్థితి మారిపోయింది. వలస కూలీల రాకతో పరిస్థితి చేయిదాటిపోతోంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటింటా ఫీవర్‌ సర్వే చేయాలని...అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి సమగ్రంగా చేపట్టాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. ప్రతి కుటుంబం వివరాలను నమోదు చేసి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని స్పష్టం చేశారు. కానీ పల్లెల్లో ఎక్కడా సీరియస్‌గా సర్వే చేస్తున్న దాఖలాలు లేవు. కేవలం కంటైన్మెంట్‌ జోన్లు, పట్టణ ప్రాంతాలకే సర్వేలు పరిమితమవుతున్న వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఇంటింటికీ వెళ్లి జ్వర పీడీతులు ఉంటే వారి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాలి. వెంటనే వారికి ప్రాథమిక నిర్థారణ పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అడ్డుకట్ట వేయాలి. అయితే సర్వేబృందాలు  వలంటీర్లు ఇచ్చిన సమాచారంతో తప్పుడు నివేదికలు అందిస్తున్నారు. కొందరు సిబ్బంది వైరస్‌కు భయపడి ఒకచోటే ఉండి వివరాలను నమోదు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.  ఫలితంగా వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. కేసులు పెరుగుతున్నాయి. సర్వే బృందాలపై పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇబ్బందిగా మారుతోంది. ఇంటింటా ఫీవర్‌ సర్వేపై ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరముంది. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.